పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SKLM: పలాస మండలం రామకృష్ణాపురంలో ఎంఎస్ఎంఈ పార్కుకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం శంకుస్థాపన చేశారు. దీని కొరకు 60.84 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం ఏపీఐఐసీకు కేటాయించడం జరిగిందన్నారు. ఎంఎస్ఎంఈ - సీడీపీ కార్యక్రమం కింద 76 ప్లాట్లను రూ.12.50 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు.