పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్
SRD: పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే స్టేజి - 1,2 అధికారుల శిక్షణ పూర్తయిందని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.