VIDEO: అలుగు పారుతున్న చెరువు.. ఇళ్లల్లోకి వరద నీరు

VIDEO: అలుగు పారుతున్న చెరువు.. ఇళ్లల్లోకి వరద నీరు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు రామచంద్రగూడలోని కోటిరెడ్డి చెరువు అలుగు పారుతోంది. దీంతో రామచంద్రగూడ గ్రామంలోకి భారీ వరద నీరు చేరింది. ఇళ్లలోకి సైతం పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రామచంద్రగూడ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.