మాచర్లలో ఈనెల 20న జాబ్ మేళా

PLD: మాచర్లలోని ఎస్‌కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 20న జాబ్ మేళా జరుగుతుందని ప్రిన్సిపల్ లక్ష్మికుమారి మంగళవారం తెలిపారు. జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, పీజీ చదివిన 18-35 ఏళ్ల యువత అర్హులని అన్నారు. మాస్టర్ మైండ్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సహా పలు సంస్థలు హాజరవనున్నాయని వెల్లడించారు.