సంక్రాంతి నాటికి మరికొన్ని పరిశ్రమల ప్రారంభం
KMM: సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్‌ను సంక్రాంతి నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఫుడ్ పార్క్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.