మంటీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్

మంటీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్

కోనసీమ: మండపేట మాజీ కౌన్సిలర్ పోలిమాటి ఆనందబాబు టీడీపీ గూటికి చేరారు. గతంలో టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఈయన 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. గురువారం 9వ వార్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆనంద్ బాబుతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.