ఉధృతంగా పారుతున్న పోలేపల్లి చెరువు

MBNR: జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలోని చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో కిష్టారం - పోలేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువు దాటే ప్రయత్నం చేయొద్దని పోలీసులు తెలిపారు.