ఈ నెల 31న చిట్యాల లో ఐక్యత 2కే రన్
NLG: ఎస్పీ శరత్ చంద్ర పవార్ మార్గదర్శకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ (భారతదేశ ఉక్కు మనిషి) జయంతి సందర్భంగా చిట్యాలలో ఐక్యత కోసం మారథాన్‌ను ఎస్సై రవి కుమార్ నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి చిట్యాల కూడలి నుంచి ఐడియల్ ఇండస్ట్రీ వరకు జరిగే 2కె రన్ లో ఉత్సాహంగా పాల్గొనాలని యువత, విద్యార్థులకు, ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.