శ్రీశైలం టికెట్ల బుకింగ్‌కు అంతరాయం

శ్రీశైలం టికెట్ల బుకింగ్‌కు అంతరాయం

NDL: శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆన్‌లైన్ ద్వారా టికెట్ల బుకింగ్‌కు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. బుక్ చేసిన టికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కాగా, ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.