మోడేకుర్రులో డెంగీ కేసు నమోదు
కోనసీమ: కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామ పంచాయితీ చిట్టూరి వారి పాలెంలో గురువారం డెంగీ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామ సర్పంచ్ కుడుపూడి రామలక్ష్మి వెంకటేశ్వరరావు, సెక్రటరీ వాసు ఆధ్వర్యంలో గ్రామంలో సానిటేషన్ నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి నక్క వెంకటేశ్వర పర్యవేక్షణలో ఇంటింటా సర్వే చేసి లార్వాలను తొలగించాలన్నారు.