దేవాలయాలతో ఆధ్యాత్మిక సేవలు విస్తరిస్తాయి: మంత్రి
WGL: ఇస్కాన్ దేవాలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక సేవలు విస్తరిస్తాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. సైబరాబాద్ పరిధిలోని నలగండ్లలో నిర్మించబోయే అతి పెద్ద ఇస్కాన్ దేవాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో ఇస్కాన్ వారిపాత్ర గొప్పదని కొనియాడారు.