దాశరథి పురస్కారంకు ప్రేమ్ లాల్ ఎంపిక

NZB: నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్ లాల్‌కు ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారం లభించింది. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని రావు ఆర్గనైజేషన్ కన్వీనర్ సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్‌లో పురస్కార అందుకొనున్నారు.