PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు

PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు

పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. అతడు ఇప్పటివరకు తొలి ఓవర్లో మొత్తంగా 24 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, గతంలో ఈ రికార్డు ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ పేరిట ఉండేది.