VIDEO: మండమెలిగే పండుగకు భక్తుల రద్దీపై ఎస్పీ అలర్ట్
MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. బుధవారం మండమెలిగే పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక అధికారులను అలర్ట్ చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్ల ద్వారా క్రమబద్ధంగా దర్శనాలు నిర్వహించాలని సూచించారు.