రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెష్

రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెష్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోదరుడి కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'నటన పట్ల అంకితభావం, కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. చరణ్ తపన, ఆధ్యాత్మిక చింతన అతనికి శ్రీరామరక్ష. భగవంతుడు అతనికి మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.