బైక్, ట్రాక్టర్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆసిఫాబాద్: కాగజ్ నగర్ మండలం గన్నారం-ఆరెగూడ సమీపంలో బైక్, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈస్ గావ్ ఎస్సై కళ్యాణ్ వివరాల ప్రకారం ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇచ్చి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.