నీటి కుంటలో పడి వ్యక్తి మృతి
NDL: ఉయ్యాలవాడ మండలం ఆర్.పాంపల్లెలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఆకుల సురేశ్(30) మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు గాలి ట్యూబ్‌తో కుంట వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో ట్యూబ్ పైనుంచి నీటిలో పడిపోయాడు. ఊపిరాడక మృత్యువాత పడినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు.