రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
మహారాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేకు మరోసారి అవకాశం కల్పించగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే, మాయా చింతామన్ ఇవ్నాతే, రామారావు వాడ్‌కుటేకు పార్టీ చోటు కల్పించింది. సామాజిక సమీకరణాలు, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.