'భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి'

'భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి'

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కేశవరావు డిమాండ్ చేశారు. గురువారం కనిగిరి తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆక్రమణలకు గురైన పలు సర్వే నెంబర్లను తహసిల్దార్‌కు అందజేసి ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలని కోరారు.