శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం VIP బ్రేక్ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గాలి భానుప్రకాష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, యాంకర్ శ్రీముఖి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.