ఓటు హక్కును వినియోగించుకున్న ముడా ఛైర్మన్

ఓటు హక్కును వినియోగించుకున్న ముడా ఛైర్మన్

MBNR: జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో ముడా (MUDA) చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వృత్తిరీత్యా న్యాయవాదినని, అందుకే బాధ్యతగా ఓటు వేయడానికి వచ్చానని తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు.