VIDEO: ఫాగింగ్ పొగతో 36 మంది విద్యార్థులు అస్వస్థత
VSP: మధురవాడలోని బక్కన్నపాలెం నవోదయ పాఠశాలలో దోమల నియంత్రణ కోసం జీవీఎంసీ సిబ్బంది చేసిన ఫాగింగ్ చర్యలు విషాదానికి దారి తీశాయి. ఫాగింగ్ వల్ల దట్టమైన పొగ వ్యాపించి, పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలతిరగడం, వాంతులు వంటి లక్షణాలతో విద్యార్థులు బాధపడటంతో వారిని కొమ్మాది ఆస్పత్రికి తరలించారు.