VIDEO: యాదాద్రి శ్రీవారి హుండీల లెక్కింపు ప్రారంభం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో వచ్చిన నెల రోజుల ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు ఆలయ EO భవాని శంకర్ తెలిపారు. హుండీ లెక్కింపును కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో అధికారులు, భద్రత సిబ్బంది పర్యవేక్షణలో ఆలయ సిబ్బందిచే ప్రారంభించారు. సాయంత్రం లెక్కింపు అనంతరం హుండీ ఆదాయం వెల్లడిస్తామని తెలిపారు.