తిరుమలలో వర్షం.. ఇబ్బందుల్లో భక్తులు
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వేకువజామున మొదలైన వర్షం నిరంతరంగా కొనసాగుతుండడంతో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, లడ్డూ విక్రయశాలకు చేరుకునే భక్తులు భారీగా ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం కారణంగా రద్దీ పెరగడంతో క్యూలైన్లలో ప్రజలు వాపోతున్నారు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని TTD అధికారులు సూచిస్తున్నారు.