భారత్ Vs దక్షిణాఫ్రికా: తుది పోరు

భారత్ Vs దక్షిణాఫ్రికా: తుది పోరు

భారత మహిళా జట్టు తొలిసారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. రికార్డు ఛేదనతో ఫైనల్‌కు చేరిన భారత్, నవంబర్ 2న నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత జట్టు మూడోసారి ఫైనల్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్ ఆడుతోంది. ఇరు జట్లలో ఎవరు గెలిచినా అది ఆ జట్టుకు తొలి వరల్డ్ కప్‌గా రికార్డుకెక్కనుంది.