VIDEO: వికారాబాద్ ఎస్పీగా స్నేహ మెహ్ర బాధ్యతలు
VKB: నూతన ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి స్నేహ మెహ్ర బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ స్థానంలో ఉన్న ఎస్పీ నారాయణ రెడ్డి రాచకొండకు బదిలీపై వెళ్లారు. మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న స్నేహ మెహ్రకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దీంతో ఇవాళ ఎస్పీ చాంబర్‌లో నారాయణ రెడ్డి ఆమెకు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.