మార్చి 6 నుండి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ

మార్చి 6 నుండి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ

TG: కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'తో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోంది. మార్చి 6 నుండి 99 రోజుల పాటు ఈ కార్యక్రమం అమలు కానుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను పారదర్శకంగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆధునిక సాంకేతికతతో ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటికే చేర్చడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యమన్నారు.