మందకొడిగా ఉప ఎన్నిక.. మీమ్స్ వైరల్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మందకొడిగా సాగుతోంది. రెండు గంటల్లో కేవలం 10.02 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 'బాబు లేవ్.. వెళ్లి ఓటేయ్' అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.