అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

కడపలో తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చెరువులు, వాగులు, వంకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 08562 - 246344 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.