ఈనెల 3న ఎక్సైజ్ వాహనాలకు వేలంపాట

ఈనెల 3న ఎక్సైజ్ వాహనాలకు వేలంపాట

SRPT: తుంగతుర్తిలోని ఎక్సైజ్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 3న బుధవారం సర్కిల్ పరిధిలోని సారాయి కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ రజిత మంగళవారం తెలిపారు. 7 ద్విచక్ర వాహనాలకు ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొనేందుకు సగం ధరావతు సొమ్ము చెల్లించి పాల్గొనాలని కోరారు.