నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: వల్లూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. వల్లూరు, నీరుల్లిపాలెం, కంబోట్లపాలెం, వల్లూరు తోట, మట్టవాని చెరువు, కరుగోరుమిల్లి, కందరవల్లి, భీమలాపురం, అయోధ్యలంక గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని ఎలక్ట్రికల్ ఈఈ మధుకుమార్ గురువారం తెలిపారు. వినియోగదారులందరూ సహకరించాలని కోరారు.