సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ కుమార్
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నూతన సబ్ రిజిస్ట్రార్‌గా పి. ప్రశాంత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు పనిచేస్తానని తెలిపారు. కార్యాలయ సేవలను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామన్నారు.