ఈనెల 26న అచ్చంపేటకు మందకృష్ణ మాదిగ రాక

NGKL: ఈ నెల 26వ తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అచ్చంపేటకి రానున్నారు. అచ్చంపేటలోని పటేల్ ఫంక్షన్ హాల్లో జరిగే పెన్షన్ల పెంపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌ఛార్జ్ నాగార్జున, అధ్యక్షుడు సౌట కాశీం, తాలూకా ఇన్‌ఛార్జ్ సాంబశివరావు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలందరు పాల్గొనాలని కోరారు.