VIDEO: కనకదాసు జయంతిలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్
SS: హిందూపురం పట్టణం శ్రీకంఠాపురంలో శ్రీ కనకదాసు జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు జ్యోతులతో ఆయన ప్రతిమను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్, ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు పాల్గొన్నారు.