రాయచోటి డిప్యూటీ డీఈవోగా నాగయ్య

అన్నమయ్య: నందలూరు ఎంఈవో - 1 లంకాయ గారి నాగయ్యకు రాయచోటి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.