మూడో విడత ఎన్నిక.. 86.65 శాతం పోలింగ్ నమోదు

మూడో విడత ఎన్నిక.. 86.65 శాతం పోలింగ్ నమోదు

KMM: ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో అధికారులు కౌంటింగ్ కోసం కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.