అందరికీ ధన్యవాదాలు: సీఎం చంద్రబాబు
AP: నారా రోహిత్ వివాహం సందర్భంగా సీఎం చంద్రబాబు 'X'లో ఓ పోస్టు చేశారు. 'మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు రామ్మూర్తి దివ్య ఆశీస్సులతో తనయుడు రోహిత్, శిరీష వివాహ వేడుకను వైభవంగా చేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు.