ఉరివేసుకొని అనుమానాస్పదంగా యువకుడు మృతి

NGKL: ఓ యువకుడు ఉరివేసుకోని అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన తాడూరు మండలం శిరసవాడలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికిచెందిన మంగలి రమేష్(30) కులవృత్తిచేసుకుంటూ జీవనంకొనసాగిస్తున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న రమేష్‌ను ఉదయం నిద్రలేపేందుకు వెళ్లిన నాయనమ్మకు కిటికీకి చున్నీతో ఉరివేసుకోని విగాతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.