ఉత్తమ ప్రతిభ కనబరిచిన మోడల్ స్కూల్ విద్యార్థిని
MHBD: తొర్రూరు మండలం గుర్తూరు మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థిని మనుశ్రీ జిల్లా స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబరించి 100 మార్కులకు గాను 84 మార్కులు సాధించి రెండవ స్థానం సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.