వాహనం ఢీకొట్టడంతో 5 గేదెలు మృతి

నెల్లూరు: దుత్తలూరు మండలం సోమల రేగడ ఎస్సీ కాలనీ వద్ద బుధవారం రాత్రి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గేదెలు మృతి చెందాయి. బొలెరో క్యాంపర్ వాహనం గేదెలను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గేదెల మృతితో ఆగ్రహించిన కాలనీవాసులు వాహనదారుడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.