గోదావరి వరద ఉధృతికి అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ

BDK: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి.. రెండోవ ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరిందన్న విషయం తెలుసుకొని జిల్లా అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.