వెయ్యికి పైగా విమానాలు రద్దు
దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్‌కు రావాల్సిన 26, వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు రద్దైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. బెంగళూరు 124, ముంబై 109, ఢిల్లీ 106, పుణె వెళ్లాల్సిన 42 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ సంస్థ 100 అదనపు విమానాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే రైల్వేశాఖ కూడా రవాణా సదుపాయాలు కల్పించింది.