కస్తూర్భా పాఠశాల ఘటన.. ఎస్ఓ ను సస్పెండ్ చేయాలి : SFI

BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలలో సోమవారం అల్పాహారం ఫుడ్ పాయిజన్ వల్ల పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాఠశాలను సందర్శించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్ఓ తప్పిదం వల్లే ఘటన జరిగిందని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.