ప్రభుత్వ కళాశాలలో రక్తదాన శిబిరం

ప్రభుత్వ కళాశాలలో రక్తదాన శిబిరం

KMR: బాన్సువాడ SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రిన్సిపల్ గంగాధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సుధాకర్ రెడ్డి, వినయ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.