ఆత్మ స్థైర్యంతో దేన్నైనా సాధించవచ్చు: డీఎస్పీ
KDP: ఆత్మ స్థైర్యంతో దేన్నైనా సాధించవచ్చు అని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన విద్యార్థులకు సూచించారు. శనివారం స్థానిక YVS మున్సిపల్ పాఠశాలలో డిఎస్పీ మాట్లాడుతూ.. బాలికలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు. ఈ మేరకు ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం కరాటేలో ప్రతిభ చూపిన బాలికలకు మెమెంటోలు ప్రధానం చేశారు.