NDA విజయోత్సాహం.. చిరాగ్ పాశ్వాన్ సంబరాలు
బీహార్ ఎన్నికల ఫలితాల్లో NDA కూటమి సత్తా చాటడంతో ఆ కూటమి భాగస్వామి అయిన LJP కూడా మంచి ఫలితాలను నమోదు చేసింది. ఆ పార్టీ ఇప్పటివరకు 4 స్థానాల్లో విజయం సాధించి, మరో 15 చోట్ల ముందంజలో ఉంది. ఈ విజయాల నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ పాట్నాలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు.