విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్
BHPL: మహాముత్తారం (M) లోని KGVB పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత లోపిస్తే విష జంతువులు సంచరించే అవకాశం ఉందని, విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.