శ్రీవారి సేవలో నారా రోహిత్ దంపతులు
సినీ హీరో నారా రోహిత్, తన భార్య శిరీష(సిరి)తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. VIP బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.