అమిత్ షా వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్

అమిత్ షా వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. 'పార్లమెంట్‌లో ఇటువంటి భాషను అనుమతించవచ్చా?' అని సూటిగా ప్రశ్నించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు సభా మర్యాదలను పాటించాలని, ప్రతిపక్ష నేతను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని ఆమె హితవు పలికారు.