VIDEO: ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

SRPT: మేళ్లచెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, గణపతి పూజ, అమ్మవారికి, రాహు-కేతువులకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన మహా హారతిలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అర్చకులు విష్ణువర్ధన్ శర్మ శంకరాచార్యుల ధర్మ ప్రచారాన్ని కొనియాడారు.